విశాఖ ఉత్తరం నుంచే పోటీ
విశాఖ ఉత్తరం నుంచే పోటీ
స్పష్టం చేసిన విష్ణుకుమార్ రాజు
వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం శాసనసభ స్థానం నుంచే పోటీ చేస్తానని ఆ
నియోజకవర్గ ఎమ్మెల్యే,
భాజపా శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.
సొంత నియోజకవర్గంలో ఓటమి భయంతోనే నేతలు స్థానాలు మారుతుంటారని తాను అలా కాదన్నారు.
బుధవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
సాంకేతికాంశాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, రేపోమాపో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు కూడా
ఆయనే చేసేస్తారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీ విషయంలో ప్రభుత్వ పనితీరు బాగుందన్నారు.