News

Realestate News

విశాఖ ఉక్కుకు ప్రచారం కొనసాగిస్తా : పి.వి.సింధు


విశాఖ ఉక్కుకు ప్రచారం కొనసాగిస్తా : పి.వి.సింధు

విశాఖ ఉక్కుకు ప్రచారం కొనసాగిస్తా : పి.వి.సింధు

విశాఖ ఉక్కు ఉత్పత్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం కొనసాగిస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం 37వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉక్కు స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటం గర్వంగా ఉందని తెలిపారు.

ఉక్కు సీఎండీ పి.కె.రత్‌ మాట్లాడుతూ కర్మాగారంలో క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

అనంతరం నిర్వహించిన సాలిడారిటీ రన్‌ను పి.వి.సింధు జెండా ఊపి ప్రారంభించారు.

స్టేడియం ప్రాంగణంలో సంస్థ సీఎండీ పి.కె.రత్‌, శారద రత్‌ దంపతులతో కలిసి మొక్కలు నాటారు.

కార్యక్రమంలో సీవీవో పి.జె.విజయకర్‌, డైరెక్టర్లు పి.రాయ్‌ చౌదరి, కె.సి.దాస్‌, వి.వి.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo