News

Realestate News

విశాఖ ఉక్కుకు ఇస్పాత్‌ రాజభాష సమ్మాన్‌ పురస్కారం

విశాఖ ఉక్కుకు ఇస్పాత్‌ రాజభాష సమ్మాన్‌ పురస్కారం
ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం రాజభాష హిందీని పటిష్టంగా అమలు చేసినందుకు గుర్తింపుగా విశాఖ ఉక్కుకు ఇస్పాత్‌ రాజభాష సమ్మాన్‌ (ప్రథమ బహుమతి) వరించింది. దిల్లీలో సోమవారం జరిగిన హిందీ సలహా కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌, సహాయ మంత్రి విష్ణుదేవ్‌ సమక్షంలో ఉక్కు సీఎండీ పి.మధుసూదన్‌, డైరెక్టర్‌(పర్సనల్‌) కె.సి.దాస్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2016-17 సంవత్సరానికి ఉక్కు మంత్రిత్వశాఖలోని ప్రభుత్వరంగ సంస్థల్లో అధికార భాష హిందీని ప్రభావవంతంగా అమలు చేసిన సందర్భంగా ఈ పురస్కారం వరించినట్టు పేర్కొన్నారు. రాజభాష అమలులో కీలక భూమిక పోషించిన విభాగం అధికారి లలన్‌ కుమార్‌కు రాజభాష కరణ్యవవయన్‌ సమ్మాన్‌ పురస్కారాన్ని అందజేశారు.