News

Realestate News

విశాఖ అపోలోలో ప్రపంచస్థాయి ట్రామా సేవలు

vizag news,apollo news of vizag

ఆరిలోవ (విశాఖపట్నం): ప్రమాదాలు, గుండెపోటు, విషం తాగడం వంటి అత్యవసరాల్లో త్వరితగతిన వైద్యం అందించేందుకు ప్రపంచస్థాయి ట్రామా సేవలను శుక్రవారం విశాఖ నగరం చినగదిలి అపోలో ఆసుపత్రిలో ప్రారంభించారు. ట్రామా అంబులెన్స్‌కు జి.పి.ఎస్‌. విధానం అమర్చడం ద్వారా ప్రమాద సంఘటనకు సరైన మార్గంలో తొందరగా చేరుకునే అవకాశం లభిస్తుందని ఆసుపత్రి సి.ఇ.ఒ. సందీప్‌ పేర్కొన్నారు. ప్రమాద సంఘటన వద్దే క్షతగాత్రుని పరిస్థితిని పరిశీలించి, అక్కడి నుంచే వైద్యం మొదలవుతుందన్నారు. 1066 లైఫ్‌లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా ప్రమాద సంఘటన వద్దకు చేరుకుంటామన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్‌ ఎ.సి.పి. కె.ప్రభాకర్‌ పాల్గొన్నారు. అంబులెన్స్‌ వాహనాలను జెండా వూపి ప్రారంభించారు. డాక్టర్‌ రంజిత్‌ సభాధ్యక్షత వహించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo