విశాఖ అంటే ఎంతో ఇష్టం
విశాఖ అంటే ఎంతో ఇష్టం
విశాఖ అంటే ఎంతో ఇష్టం
విశాఖ నగరమంటే తనకెంతో ఇష్టమని, ఆర్కే బీచ్ అందాలు కనువిందు చేస్తాయని ప్రముఖ సినీ హాస్య నటుడు ఆలీ పేర్కొన్నారు. తాటిచెట్లపాలెం
80 అడుగుల రోడ్డులో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవంలో
ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, సంక్రాంతి పండగకు ఇటువంటి పోటీలు మరింత వన్నె
తెచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనసేన నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతలపూటి
వెంకటరామయ్య, జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ గేదెల శ్రీనుబాబు కూడా మాట్లాడారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం
అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మాజీ ఎమ్మెల్సీ రేవు రత్నకుమారి, సాహతీవేత్త శేషుమాంబ వ్యవహరించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి
దక్కించుకున్న ఆర్.ప్రవీణకు కిలో వెండిని ఆలీ చేతుల మీదుగా అందజేశారు. హాస్యనటుడు అంబటి శ్రీనివాస్, జనసేన నాయకులు రమణారెడ్డి,
వేగి దివాకర్, రఘు, మైలపిల్లి శ్రీనివాస్, బి.ఎన్.మూర్తి, రంగారావు, త్రివేణి, దుర్గా తదితరులు పాల్గొన్నారు.