News

Realestate News

విశాఖలో కలాం సాంస్కృతిక కేంద్రం


విశాఖలో కలాం సాంస్కృతిక కేంద్రం

ముస్లింల కోసం పది ఎకరాల్లో ఏర్పాటు
శంకుస్థాపన రేపు

విశాఖలో కలాం సాంస్కృతిక కేంద్రం

ముస్లింల కోసం విశాఖపట్నంలో అబ్దుల్‌ కలాం పేరిట ప్రత్యేకంగా సాంస్కృతిక అధ్యయన కేంద్రం, రూ.కోటితో ఉర్దూ గ్రంథాలయం

ఏర్పాటు కానున్నాయని..

ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే

రహమాన్‌ తెలిపారు.

గురువారం విశాఖలో ముస్లిం మత పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విశాఖలోని ఆనందపురం మండలంలో రహదారికి సమీపంలో రూ.5 కోట్లతో ఈ కేంద్రం ఏర్పాటుకానుందని వివరించారు.

ఈద్గా, సమావేశ మందిరాలు, అద్భుత ఆకృతులతో కూడిన మసీదు, శిక్షణ కార్యాలయాలు వంటివి ఇందులో ఉంటాయని చెప్పారు.

ఈ నెల 9న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు,

ఫరూక్‌తో పాటు శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పాల్గొంటారని తెలిపారు.

ముస్లింలకు రాష్ట్రంలో పది సీట్లయినా కేటాయించాలని ఈ సందర్భంగా రహమాన్‌ కోరారు.