News

Realestate News

విశాఖలో ఐటీ విస్తృత సోదాలు


విశాఖలో ఐటీ విస్తృత సోదాలు

 

విశాఖపట్నం:విశాఖలో ఐటీ విస్తృత సోదాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మరోసారి తనిఖీలు చేపట్టింది.
విశాఖలోని ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సుమారు 50 వాహనాల్లో అధికారులు నగరంలోని
వివిధ ప్రాంతాలకు తనిఖీల నిమిత్తం బయలుదేరి వెళ్లారు. దువ్వాడ సెజ్‌లోని పలు గోదాముల్లో అధికారులు సోదాలు
చేస్తున్నారు. దీంతో పాటు లాజిస్టిక్‌ రంగంలో భారీ కంపెనీగా ఉన్న టీజీఐలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ సంస్థ తెలంగాణ తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ బంధువులకు చెందినదిగా తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించి
ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ సంస్థపై దృష్టి సారించినట్లు
సమాచారం.

ఆర్థికంగా, పారిశ్రామికంగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో కొందరు పన్ను సరిగా చెల్లించడం

లేదన్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐటీ దాడుల ప్రచారం వివిధ రాజకీయ పక్షాల్లో కీలకంగా ఉన్నవారిలోనూ అలజడి రేపుతోంది.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo