News

Realestate News

విశాఖలో ఆక్టోపస్‌ విభాగం

Octopus section implementation in Vizag by DGP picture

‘విశాఖలో ఆక్టోపస్‌ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. ఇక్కడి సిబ్బంది కొరతనూ తీరుస్తాం. పోలీసు నియామకాల్లో ఇంటరు పూర్తిచేసినవారితోపాటు మూడేళ్ల డిప్లొమా కోర్సులు చేసినవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలను విశాఖ కమిషనరేట్‌ పరిధిలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం’

– ఇన్‌ఛార్జి డీజీపీ సాంబశివరావు

సైబర్‌ నేరాలపై దృష్టి సారించాలి
ఇన్‌ఛార్జి డీజీపీ సాంబశివరావు
విశాఖపట్నం, ఈనాడు: విశాఖ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కమిషనర్‌ యోగానంద్‌ బాగా కష్టపడుతున్నారని ఇన్‌ఛార్జి డీజీపీ సాంబశివరావు అన్నారు. బుధవారం విశాఖ వచ్చిన సందర్భంగా కమిషనరేట్‌ సమావేశ మందిరంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో ఇక్కడ సీపీగా పని చేసినందున నగరంపై మంచి అవగాహన ఉందన్నారు. సైబర్‌ నేరాలు, దొంగతనాలు, రహదారి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై దృష్టిసారించాలని సూచించారు. సైబర్‌ నేరాల సంఖ్య ఎక్కువగానూ, కొలిక్కి వచ్చిన కేసులు తక్కువగానూ ఉన్న నేపథ్యంలో వీటిపై మరింత దృష్టిపెట్టాలన్నారు. నేరాల సంఖ్య నిరోధించేందుకు సృజనాత్మక పరిష్కారాలను, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పోలీసు నిఘాను పెంచేందుకు ఆధునికీకరణను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించామని తెలిపారు. తొలుత నగర కమిషనరేట్‌ పరిధిలో వివిధ నేరాల సరళిని సీపీ యోగానంద్‌ దృశ్య మాధ్యమంలో ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతి ఎ.బి.వెంకటేశ్వరరావు, డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo