News

Realestate News

విశాఖకు వెల్లువెత్తిన పెట్టుబడులు

విశాఖకు వెల్లువెత్తిన పెట్టుబడులు
2,335 ఎం.ఎస్‌.ఎం.ఇ.లు సాకారం
 30 భారీ పరిశ్రమలు ప్రారంభం
 గత నాలుగేళ్లలో జిల్లాలో ఏర్పడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు: 2335
 వీటి పెట్టుబడి: రూ. 1434 కోట్లు
 ఉద్యోగాలు: 36,204
 త్వరలో ఏర్పాటు కానున్న పరిశ్రమలు: 214
 వీటి పెట్టుబడులు: రూ. 349.11 కోట్లు
ఈనాడు – విశాఖపట్నం
విభజన అనంతరం విశాఖ నగరం పారిశ్రామికంగా మరింత పైకి ఎగబాకింది. పోర్టు, ఎయిర్‌పోర్టు, రైలు రవాణా సదుపాయాలు విస్తృతంగా ఉండడంతోపాటు దేశ తూర్పుతీరానికి మధ్య భాగంలో ఉండడం అత్యంత అనుకూల అంశంగా మారింది. వివిధ సంస్థలకు ఇక్కడున్న సానుకూలాంశాలను ప్రభుత్వం తెలియజేస్తూ వచ్చింది. పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులను 21 రోజుల్లో ఆన్‌లైన్లో ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో అనేకమంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని చాలా వేగంగా స్థాపించగలిగారు.

* నాలుగేళ్లకాలంలో 30 భారీ పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా రూ. 1693.46 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఈ సంస్థల్లో 16,001 మందికి ఉద్యోగాలొచ్చాయి.
* మరో 89 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిద్వారా రానున్న పెట్టుబడులు: రూ. 1,28,936.38 కోట్లు.
* అందుబాటులోకి రానున్న ఉద్యోగాలు: 1,12,527

ఫార్మాసంస్థలదే అగ్రస్థానం….
జిల్లాలో ప్రారంభమైన భారీ పరిశ్రమల్లో ఫార్మా సంస్థలే ఎక్కువ.
* లారస్‌ ల్యాబ్స్‌ పరవాడలో రూ. 167.70 కోట్లు, అచ్యుతాపురంలో రూ. 390.2 కోట్ల పెట్టుబడితో యూనిట్లను ప్రారంభించింది.
* అరబిందో సంస్థ రూ.159,.14 కోట్ల పెట్టుబడితో ఫార్మాసిటీలో ఔషదాల ఉత్పత్తిని ప్రారంభించింది.
* వసుధా ఫార్మా, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, లూపిన్‌, మన్నే ల్యాబ్స్‌, మెట్రోకెమ్‌, సన్విరా, అసుర్జెన్‌, హోస్పిరా, శ్రియం, గ్రాన్యూల్‌ ఒమ్నికెమ్‌, ఆనర్‌ ల్యాబ్స్‌ తదితర ఫార్మా సంస్థలన్నీ ఉత్పత్తిని ప్రారంభించాయి. 30 సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించే దశకు చేరుకున్నాయి.

పారిశ్రామికవాడల కొరతే అడ్డంకి….
జిల్లాలో సమగ్ర మౌలికవసతులతో కూడిన పారిశ్రామికవాడలు లేకపోవడం పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద సవాలుగా మారింది. సదుపాయాలుంటే మరిన్ని సంస్థలు వచ్చేవి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 36 పారిశ్రామిక వాడలున్నప్పటికీ ఇంచుమించు అన్నీ నిండిపోయాయి. అనంతవరం, రాచపల్లి, గుర్రంపాలెం, అరకు, కుంచంగి ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ కూడా పూర్తైంది. .

ప్రాజెక్టుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నాం….
ప్రతి ప్రాజెక్టు ప్రగతిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నాం. పరిశ్రమ ఏర్పాటులో వేగం మందగిస్తే కారణం తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ఫలితంగా 30 పరిశ్రమలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. కొన్ని విస్తరణ ప్రాజెక్టులు కావడంతో వేగంగా పూర్తయ్యాయి.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo