విలువిద్య, గుర్రపుస్వారీ శిక్షణ
విలువిద్య, గుర్రపుస్వారీ శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు హాజరు
న్యూస్టుడే, ఆరిలోవ: శ్రీకృష్ణాపురం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దసరా సెలవుల సందర్భంగా రాష్ట్రస్థాయి విలువిద్య, గుర్రపు స్వారీ శిక్షణా కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి నగేష్, ప్రత్యేక అతిథులుగా కేంద్ర కారాగార ఉప పర్యవేక్షణాధికారులు డాక్టర్ సన్యాసిరావు, వెంకటేశ్వర్లు, గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఆర్.డి.వి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, అధ్యాపకులు ప్రభుదాస్ ప్రసంగించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 188 గురుకుల పాఠశాలల నుంచి 200 మంది ఈ శిబిరానికి వచ్చారు. ఎ.పి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి.రాములు పర్యవేక్షిస్తున్నారు. 150 మంది బాలికలు, 50 మంది బాలురు శిబిరంలో పాల్గొంటున్నారని, వారందరికీ ఇక్కడే వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ కోటేశ్వరరావు తెలిపారు.