News

Realestate News

విమ్స్‌ ప్రారంభానికి సీఎం, కేంద్రమంత్రి రాక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌) ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రఆరోగ్యశాఖ మంత్రి జె.సి.నడ్డాలను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సోమవారం గవర్నర్‌ బంగ్లాలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, విమ్స్‌ ఓఎస్‌డీ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, తెదేపా రాష్ట్ర నాయకులు లాలం భాస్కర్రావు తదితరులతో విమ్స్‌ ప్రారంభం విషయమై మంత్రి చర్చించారు. ఈనెల 11న విమ్స్‌లో ఓపీ, క్యాజువాల్టీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ అధ్యక్షతన విమ్స్‌ ఆసుపత్రి హెచ్‌.డి.ఎస్‌. సమావేశమై ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి దృష్టికి కలెక్టర్‌ తీసుకెళ్లారు. విమ్స్‌ ఆవరణలో పచ్చదనం పెంపొందించే పనులను వుడాకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు.

 

Source By: http://www.eenadu.net/

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo