News

Realestate News

విమ్స్‌ను ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తాం


విమ్స్‌ను ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తాం

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే :విమ్స్‌ను ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తాం

విశాఖ వైద్యవిజ్ఞాన సంస్థ(విమ్స్‌)ను ఎయిమ్స్‌ తరహాలో పరిశోధన సంస్థగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర వైద్యవిద్య శాఖమంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌

అన్నారు.

విమ్స్‌లో 874 పోస్టుల భర్తీకి ఇటీవల క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం విమ్స్‌లో ఆయన వైద్యవిద్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి సిబ్బంది నియామక జీవో 224ను విడుదల చేశారు.

మూడు నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టి పేదప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందేలా చర్యలు

తీసుకుంటామని అన్నారు.

దీనికి ప్రతి నెల రూ. 38.47 కోట్లు ఖర్చవుతున్నా వైద్యసేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకువెళ్తుందన్నారు.

అనంతరం వార్డులను సందర్శించి రోగులతో సౌకర్యాల గురించి, వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

రికార్డులు పరిశీలించి ఏడాది కాలంగా సాధించిన ప్రగతిని విమ్స్‌ డైరక్టర్‌ కడలి సత్యవరప్రసాద్‌ను అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.

ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహమాన్‌, విమ్స్‌ అధికారులు పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo