News

Realestate News

విమానాశ్రయంలో వసతుల కల్పన

విమానాశ్రయంలో వసతుల కల్పన
‘ఈనాడు’ కథనానికి స్పందన
ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే : విమానాశ్రయంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు విమాశ్రయ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ శర్మ తెలిపారు. ప్రయాణికులు, సందర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి స్పందించి సదుపాయాలు కల్పించారు. దీనికితోడు నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల దృష్ట్యా అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్ల ఆధునికీకరణ, తనిఖీ కేంద్రాల ఏర్పాటు, విదేశీ ప్రయాణికులు సౌకర్యార్థం ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు కోసం వచ్చే బంధువులకు టెర్మినల్‌ భవనం బయట కుర్చీలను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.