వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
హెచ్‌పీసీఎల్ అసిస్టెంట్ సేల్స్ అధికారి వెంకటేశ్వర్లు
మల్కాపురం, న్యూస్‌టుడే : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ సేల్స్ అధికారి పి.వెంకటేశ్వర్లు అన్నారు. జీవీఎంసీ 48వ వార్డు పరిధిలోని సంస్థ మిలీనియం పెట్రోల్‌బంకు ద్వితీయ వార్షికోత్సవాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. చమురు ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విక్రయాల్లో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించాలన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. మిలీనియం పెట్రోల్‌బంకు మేనేజర్ సత్యవాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హెచ్‌పీసీఎల్ రిఫైనరీ డీజీఎం వీవీ.మురళీకృష్ణ, బ్లాక్ ఆయిల్ టెర్మినల్ డీజీఎం దండపాణి తదితరులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399