News

Realestate News

విద్యా సంస్థల్లో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు


విద్యా సంస్థల్లో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు

ఆకతాయిల ఆట కట్టిస్తాం

నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే:విద్యా సంస్థల్లో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు..

విద్యాసంస్థల్లో వెంటనే క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని నర్సీపట్నం ఎ.ఎస్‌.పి. కె.అరిఫ్‌హఫీజ్‌ ఆదేశించారు.

గురువారం సాయంత్రం నర్సీపట్నంలో అన్ని యాజమాన్యాల కళాశాలలు,

పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఒక్కో విద్యా సంస్థ నుంచి ఇద్దేరేసి విద్యార్థినులతో ఆయన సమావేశమయ్యారు.

ఈవ్‌టీజింగ్‌లు, వేధింపులు ఉన్నట్టయితే తప్పనిసరిగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గంజాయి రవాణాలో కొంతమంది విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు.

ఇటీవల ఇంజినీరింగ్‌ విద్యార్థి ఒకరు తమకు పట్టుబడ్డారని వెల్లడించారు.

విద్యార్థుల నడవడికపై నిఘా ఉంచాలని, అనుమానం ఉంటే అప్రమత్తం కావాలన్నారు.

గంజాయి కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తు పాడవుతుందని తెలియజేయాలని సూచించారు.

ప్రతి విద్యా సంస్థలోనూ ఫిర్యాదు పెట్టెలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.

ఎప్పటికప్పుడు ఈ పెట్టెని తెరిచి విద్యార్థుల నుంచి వచ్చే విన్నపాలు, ఫిర్యాదులపై స్పందించాలని కోరారు.

పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఏవైనా ఉంటే వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత కమిటీలదేనని స్పష్టం చేశారు.

పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎ.ఎస్‌.పి. దృష్టికి సమస్యలు తీసుకువవచ్చారు.

మద్యం దుకాణాల వద్ద యువకులు బీర్లు తాగుతూ హీరోయిజం ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

కళాశాలలు విడిచిపెట్టే సమయంలో అనేకమంది యువకులు ద్విచక్రవాహనాలపై వేగంగా వస్తూ విద్యార్థినులను భయపెడుతున్నారని,

పెద్దశబ్దంతో హారన్‌ మోగిస్తూ అసౌకర్యానికి గురిచేస్తున్నారని వివరించారు.

బస్సుల్లో ఈవ్‌టీజింగ్‌ ఎక్కువగా ఉందన్నారు.

కళాశాల వదిలిన తర్వాత ఆకతాయిలు వెంటపడుతున్నారని తెలిపారు.

తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తల్లిదండ్రులకు చెబితే చదువు మానిపిస్తారని విద్యార్థినులు భయపడుతున్నారని చెప్పారు.

యాభైమంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది వరకు ప్రయాణించాల్సి వస్తోందని, వేలాడుతూ వెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ఎ.ఎస్‌.పి మాట్లాడుతూ ఆకతాయిల ఆట కట్టిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఎ.ఎస్‌.పి. బాలికలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.

అనేకమంది బాలికలు తాము ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందులను నిర్భయంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

విద్యార్థినులు చెప్పిన అంశాలన్నీ ఓపిగ్గా విన్న ఎ.ఎస్‌.పి. వారికి భరోసా ఇచ్చారు.

సమావేశంలో పట్టణ సి.ఐ సింహాద్రినాయుడు పాల్గొన్నారు.

దాడులు మొదలు
నర్సీపట్నం అర్బన్‌: అమ్మాయిలను అల్లరిపెట్టే ఆకతాయిలను,

వేగంగా బైకులు నడిపే యువకులను కట్టడి చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

గురువారం సాయంత్రం నుంచే వివిధ కూడళ్లలో మఫ్టీలో పోలీసులు నిఘావేసి ఇరవైమందిని పట్టుకున్నారు.

వీరిని ఎ.ఎస్‌.పి. ముందు హాజరు పరిచారు. అందరి చిరునామాలు తీసుకుని హెచ్చరించి పంపేశారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo