News

Realestate News

విద్యా మంత్రులకు ముఖ ద్వారం


విద్యా మంత్రులకు ముఖ ద్వారం

విద్యా మంత్రులకు ముఖ ద్వారం

పీవీజీ రాజు (పాతచిత్రం)

భీమునిపట్నం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముగ్గురు విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. విజయనగర సంస్థానాధీశులు

పీవీజీ రాజు భీమిలి నుంచి 1962-67 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనందగజపతిరాజు 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఇక్కడ్నుంచే పోటీచేసి గెలుపొందారు.

ఎన్టీ రామారావు కేబినెట్‌లో విద్యామంత్రిగా రెండేళ్లు విధులు నిర్వహించారు.

ఇలా తండ్రీకొడుకులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు.

ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో గత అయిదేళ్లుగా విద్యాశాఖ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా ముగ్గురు ఎమ్మెల్యేలను రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రులుగా అందించిన చరిత్రను భీమిలి సొంతం చేసుకుంది. – న్యూస్‌టుడే, తగరపువలస

ఆనందగజపతిరాజు (పాతచిత్రం)

గంటా శ్రీనివాసరావు