విద్యార్థుల ‘దానోత్సవం’
విద్యార్థుల ‘దానోత్సవం’
హృదయం ఎక్కడో లేదు
యువత సేవాభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
ఓ వైపు చదువుతూ మరోవైపు సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు.
బీటెక్ చదువుతున్న పలువురు విద్యార్థినులు ఓ బృందంగా ఏర్పడి ‘దానోత్సవం’ పేరిట నిరుపేదలకు చేయూతనందించే యజ్ఞంలో చేయి చేయి
కలిపారు.
విభాగం సహాయక ఆచార్యులు జి.ఎస్.ఆర్.సంజీవిని వీరికి మద్దతుగా నిలిచేందుకు ప్రతి విభాగ తరగతి నుంచి ఒక్కో విద్యార్థిని చొప్పున 24మందిని
సమీకరించి గొప్ప కార్యాన్ని తలపెట్టించారు.
తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు, అధ్యాపకబృందం, సిబ్బంది వారి కుటుంబసభ్యుల
నుంచి పుస్తకాలు, దుస్తులు తదితర పాతవస్తువులను సేకరించారు.
ఈ సేకరణలో వచ్చిన 8టన్నుల వస్తువులను ఒక గదిలో ఏర్పాటు చేసి దుస్తులు, పుస్తకాలు, పలు సామాన్లను వేరు చేసి బాక్సుల్లో ప్యాకింగ్ చేసి
నగరంలో ‘వైజాగ్ స్మైలీస్’ (స్వచ్ఛందసేవాసంస్థ) నిర్వాహకులు పి.బర్నబాస్కు అందజేశారు.
ఆ సంస్థ ద్వారా నిరుపేదలకు ఆ వస్తువులు అందేలా ఏర్పాట్లు చేశారు.
ఐటీ పూర్వ విద్యార్థిని హృదయ ఆలోచన నుంచి ప్రారంభమైన ‘దానోత్సవం’ నేడు ఎంతో మందిని భాగస్వాములను చేసింది.
బి.టెక్ చదివిన హృదయ అన్ని విభాగాల్లో చదువుతున్న విద్యార్థినులకు ఒక్కొక్కరికీ ‘రూపాయి’ చొప్పున ఓ బాక్సులో ప్రతి రోజు వేయించి ఆ వచ్చిన
డబ్బులను ఆరు నెలలకోసారి లెక్కకట్టి అనాథాశ్రమాల్లో ఉన్న విద్యార్థులందరికీ సాయం చేస్తుండేది.
ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అనాథలు, వృద్ధులు, విద్యార్థులకు ఆసరా ఇవ్వాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మరిన్ని సేవా కార్యక్రమాలు : దానోత్సవం పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహించనున్నాం.
8 టన్నులతో పలు వస్తువులను తిత్లీ తుపాను బాధితులకు, పలు ఆశ్రమాలకు అందించాలని వైజాగ్ స్మైలీస్ సంస్థకు అందజేశాం.
ప్రతి నెలా తల్లిదండ్రులు ఇచ్చే ‘పాకెట్ మనీ’ని వృథాగా వెచ్చించకుండా,
ఆ మొత్తంతో పేదలకు తమ వంతు సాయపడనున్నాం.
అంతేకాక పేదల కోసం జోలె పడతాం..
విరాళాలు, దుస్తులు, పుస్తకాలు సేకరించనున్నాం.
అన్ని ఆశ్రమాలకు మా వంతుగా సహాయపడతాం.
మరింత మందిని మాలో భాగస్వాములను చేసుకుని ‘దానోత్సవం’ విస్తరిస్తాం.