News

Realestate News

విద్యార్థులు రంగంలోకి దిగితే ఉద్యమాలు విజయవంతం


విద్యార్థులు రంగంలోకి దిగితే ఉద్యమాలు విజయవంతం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే:విద్యార్థులు రంగంలోకి దిగితే ఉద్యమాలు విజయవంతం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం విద్యార్థులు రంగంలోకి దిగితే ఏ ఉద్యమమైనా పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని సినీనటుడు,

దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు.

ఏపీ విద్యార్థి, యువజన సంఘాల జె.ఎ.సి, ఏపీ నిరుద్యోగ జె.ఎ.సి. సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి చేపట్టిన ప్రత్యేక హోదా,

విభజన హామీల  సమరయాత్ర (జీపు యాత్ర) శనివారం వీఎస్‌ కృష్ణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్దకు చేరుకుంది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్‌.నారాయణమూర్తి పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

2014 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి మోదీ తిరుపతి వెంకన్నసాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమన్నారు.

మన హక్కులు సాధించుకునేందుకు అవసరమైతే కేంద్రాన్ని స్తంభింప చేయాలని కోరారు.

సినీనటుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదాకోసం సినీ పరిశ్రమ ప్రజలకు మద్దతుగా నిలుస్తుందన్నారు.

ఏపీ నిరుద్యోగ జె.ఎ.సి. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆకలికేకలు,

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని కోరుతూ కృష్ణా కళాశాల రహదారిపై మోకాళ్లపై నిరసన తెలిపారు.

చలసాని శ్రీనివాస్‌, వివిధ విద్యార్థి, జెఎసీ సంఘాల నాయకులు ఎం.సూర్యారావు, శ్రీనివాసరావు,

యు.ఎస్‌.ఎన్‌.రాజు, పృధ్వీ, లెనిన్‌బాబు, నాగిరెడ్డి, చంద్రశేఖర్‌, ఫణింద్ర, తిరుపతిరావు,

సంతోష్‌, కౌశల్య, విజయ్‌రఘనాథభట్ల అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo