News

Realestate News

విద్యార్థులు ప్రశ్నోత్తర పద్ధతిని నేర్చుకోవాలి


విద్యార్థులు ప్రశ్నోత్తర పద్ధతిని నేర్చుకోవాలి

బాలల గణిత, విజ్ఞాన శాస్త్ర సదస్సులో వక్తలు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే :విద్యార్థులు ప్రశ్నోత్తర పద్ధతిని నేర్చుకోవాలి
విద్యార్థులు ప్రశ్నోత్తర పద్ధతిని నేర్చుకోవాలని హాంకాంగ్‌ న్యూ జనరేషన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్‌ జిమ్మి వాంగ్‌ అన్నారు.
శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ ఆధ్వర్యంలో వుడా బాలల ఎరినాలో నిర్వహిస్తున్న నాలుగో అంతర్జాతీయ బాలల గణిత, విజ్ఞాన శాస్త్ర సదస్సు రెండో రోజు కొనసాగింది.
ముందుగా టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం, సైన్స్‌ అంశాలపై జిమ్మి వాంగ్‌ ప్రసంగించారు.
థాయ్‌లాండ్‌ సుయాన్‌ సునంద రాజ్‌భట్‌ వర్సిటికి చెందిన యింగ్‌ ప్రయూన్‌, మహారాష్ట్ర అకాడమీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్‌ సుధాకర్‌,
చెన్నై ఎకో సైన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఎం.డి. సుల్తాన్‌ అహ్మద్‌ ఇస్మాయిల్‌లు మాట్లాడుతూ ప్రతీ విషయంలో శ్రద్ధ చూపాలని,
చర్చ, ముగింపు అనేవి చాలా ముఖ్యమన్నారు.
సాయంత్రం నంచి పిల్లల దినోత్సవం ఘనంగా జరిపారు.
చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శలను అలరించాయి.
డాక్టర్‌ ఎ.పి.జయారామన్‌, అరున్‌ రాజా, డాక్టర్‌ పి.జె.ఎల్‌.జి.నోనిస్‌, ఆచార్య బాలమోహన్‌దాస్‌,
పాఠశాల డైరెక్టర్‌ వాసు ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

అబ్బురపరిచిన అంతర్జాతీయ గణిత, విజ్ఞాన సదస్సు 

వుడా చిల్డ్రన్‌ ఎరినాలో శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ గణిత, వైజ్ఞానిక సదస్సులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన విద్యా,
వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
జిల్లాకు చెందిన విద్యార్థులతో పాటు భువనేశ్వర్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు హాంక్‌కాంగ్‌,
మలేషియా, సౌత్‌ఆఫ్రీకా ఇలా పలు దేశాల నుంచి విద్యార్థులు పలు నమూనాలు,
పరిశోధనాపత్రాలను ప్రదర్శించారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo