News

Realestate News

విద్యార్థులకు వ్యాయామంతో ఏకాగ్రత


విద్యార్థులకు వ్యాయామంతో ఏకాగ్రత

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: వ్యాయామంతో విద్యార్థులకు ఏకాగ్రత సాధ్యం

అవుతుందని దీనికోసమే ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో 70

మందికి పైగా పోలీసులు, కళాశాల విద్యార్థులతో కలిసి సైకిల్‌ ర్యాలీ

నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.ప్రతాప్‌ తెలిపారు.

స్థానిక డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ జరిపారు.

ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ వ్యాయామం ప్రాముఖ్యతను విద్యార్థులకు

తెలిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని దీనివల్ల

ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు.

డైట్‌ కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ పర్యావరణ

కాలుష్యాన్ని తగ్గించడానికి శారీరక వ్యాయామానికి,

ఏకాగ్రతకు సైకిల్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌.ఎస్‌.నాగప్రసాద్‌ పాల్గొన్నారు.

కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ కె.ఎస్‌.ఈశ్వరరావు, విభాగాధిపతులు పాల్గొన్నారు.