విజ్ఞాన వీక్షణం
విజ్ఞాన వీక్షణం
ఫిన్‌టెక్ సదస్సులో వైజ్ఞానిక ప్రదర్శన
కొత్తంశాలను పరిచయం చేసింది
దేశవిదేశీ ప్రతినిధులు వీటిని తిలకించారు.
ఒక్కోసారి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించలేని పరిస్థితి.
ఇలాంటి సమయాల్లో నీటిలో ప్రయా
సముద్రాలు, జలాశయాల్లో తరచూ నౌకలు, పడవలు మునిగిపోతుంటాయి.ణించే డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సేఫ్ సీ రోబోటిక్ వాటర్ డ్రోన్ నిర్వాహకుడు అలీఅజ్గర్ చెబుతున్నారు.
సముద్రం, జలాశయాల మధ్యలో ఎవరైనా పడిపోతే గజ ఈతగాళ్లయినా వారిని రక్షించలేరు.
సమయాల్లో ఈ డ్రోన్‌ను పంపించి మనం తీరం నుంచే రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయొచ్చు.
ఒకేసారి ముగ్గురు దీన్ని పట్టుకోవచ్చు.
ఆ తరువాత జాగ్రత్తగా తీరానికి వచ్చేలా చేయొచ్చని ఆయన వివరించారు.
పొలంలోనే వాతావరణ కేంద్రం
రైతుకు వాతావరణ వివరాలు తప్పనిసరి.
ఎప్పుడు ఏ పంట సాగు చేయాలి? సాగు సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది, గాలి వేగం ఎంత?
వర్షం కురుస్తుందా? వంటి అంశాలు కీలకం.
ఇలాంటి వాటిపై రైతుకు కచ్చితమైన సమాచారం అందించొచ్చని చెబుతున్నారు సెడ్రిక్.
ఇందుకోసం పొలంలోనే అమర్చేలా ఆగ్రో వెదర్ స్టేషన్‌ను రూపొందించామని చెప్పారు.
పొలంలోనే దీన్ని ఏర్పాటు చేయాలి.
దీనికి సంబంధించిన యాప్‌కు అనుసంధానించాలి.
జీపీఎస్, సెన్సార్ల సహాయంతో ఇది పనిచేస్తుంది.
ఇప్పటికే ఫ్రాన్స్, యూకే, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌లో వీటిని ఉపయోగిస్తున్నారు.
తాజాగా మన దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని సెడ్రిక్ డిబోనెట్ తెలిపారు. త్వరలో దేశమంతా విస్తరిస్తామన్నారు.
దీని ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా..
సమీప భవిష్యత్తు అంచనాలను కూడా తెలుసుకోవచ్చన్నారు.
ట్వీట్ కొట్టు.. కప్పు పట్టు
వీడియోగేమ్స్, సృజనాత్మక పోటీల ద్వారా ఉత్పత్తులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది టేగ్ల్యాబ్స్.
విభిన్న ఆలోచనలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఆకట్టుకోవడమే ఈ సంస్థ వ్యాపారం.
ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ట్వీట్ కేఫ్ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది.
మన మొబైల్లోని ట్విట్టర్ సహాయంతో వైజాగ్ ఫిన్టెక్కు ట్వీట్ చేయగానే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులోంచి కాఫీ కప్పు బయటకు వస్తుంది.
ఇది ట్యాగ్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ సహాయంతో మనం పంపిన సందేశానికి అనుసంధానమై ఎంపికవుతుందని దిల్లీ నుంచి వచ్చిన టేగ్ల్యాబ్స్ ప్రతినిధులు శివ్‌సాగర్, విధీశర్మ, కరణ్భాటియా తెలిపారు.
భారీ ప్రదర్శనలు, సదస్సుల్లో ఇటువంటివి ఎంతో ఆకట్టుకుంటాయన్నారు.
ట్వీట్ చేసి కప్పులను సొంతం చేసుకునేందుకు చాలామంది పోటీపడ్డారు.
మంగళవారం ఒక్క రోజే 300 కప్పులు అందజేశారు. మరో రెండు రోజుల పాటు దీన్ని ఇక్కడే కొనసాగించనున్నారు.