లోక కల్యాణార్థమే.. అతిరుద్ర యాగం
లోక కల్యాణార్థమే.. అతిరుద్ర యాగం
మాధవధార, న్యూస్టుడే(Kalyanarthame atirudra sacrifices of the world): లోక కల్యాణార్థమే అతిరుద్ర యాగం నిర్వహిస్తున్నట్లు యాగబ్రహ్మ శ్రీ వేదమూర్తి ద్వాదశ ఉమామహేశ్వర శర్మ, శ్రీరామచంద్ర మూర్తి అన్నారు. వారణాసి లక్ష్మీనారాయణ స్పిర్చువల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారదాగార్డెన్స్లో ఆదివారం అతిరుద్రయాగం ప్రారంభమైంది. వివిధ ఆలయాల అర్చకులు పాల్గొని యాగం నిర్వహించారు. 11 రోజుల పాటు 18 రకాల హోమాలు, యాగాలు చేస్తున్నామని, 11 యజ్ఞకుండలాలు, 121 వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని సంస్థ సభ్యులు తెలిపారు.