లక్ష్యసాధనకు సైనికుల్లా పనిచేస్తాం
లక్ష్యసాధనకు సైనికుల్లా పనిచేస్తాం

లక్ష్యసాధనకు సైనికుల్లా పనిచేస్తాం
అనకాపల్లిలో కేక్ కోసి వేడుకలు నిర్వహిస్తున్న వైకాపా నాయకులు
పట్టణంలోని రింగురోడ్డులోని వైకాపా కార్యాలయంలో మంగళవారం వైకాపా వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
నియోజకవర్గ వైకాపా కన్వీనర్ గుడివాడ అమర్నాథ్, వైకాపా నాయకులు దాడి రత్నాకర్ కేక్ కోసి వేడుకలు జరిపారు.
అనంతరం వైకాపా జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే ఆయన కుమారుడు వైకాపాను స్ధాపించారన్నారు.
రాజన్న రాజ్యం కోసం జగన్‌ను సీఎంను చేయాలని కోరారు.
ఎన్నికలకు 29 రోజులు మాత్రమే ఉందని కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి పార్టీకి పట్టం కట్టాలని సూచించారు తెదేపా హాయంలో అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు.
కశింకోట మండలంలోని నల్లమారమ్మ ఆలయంలో పూజలు చేసి బుధవారం నుంచి నియోజకవర్గ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైకాపా నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకీరామరాజు, గొర్లిసూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్ పాల్గొన్నారు.