News

Realestate News

రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే డివిజను కమిటీ సమావేశం నుంచి అశోక్‌ వాకౌట్‌


రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే

డివిజను కమిటీ సమావేశం నుంచి అశోక్‌ వాకౌట్‌

 

రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే డివిజను కమిటీ సమావేశం నుంచి అశోక్‌ వాకౌట్‌

              విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా విశాఖ కేంద్రంగా ఇస్తామన్న రైల్వేజోన్‌ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైల్వే డివిజను కమిటీ సమావేశం నుంచి జిల్లా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు వాకౌట్‌ చేశారు.రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే డివిజను కమిటీ సమావేశం నుంచి అశోక్‌ వాకౌట్‌ .

                 బుధవారం విశాఖపట్నంలో రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో వాల్తేరు డివిజను పరిధిలోని పార్లమెంట్‌ సభ్యులతో డివిజను కమిటీ సమావేశం నిర్వహించారు.

               అశోక్‌తో పాటు ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, కింజరాపు రామ్మోహననాయుడు మద్దతుగా నిలిచారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త ప్రతిపాదనలు మంజూరు చేయాలని కోరారు.

మంజూరైన పనులపై స్పందన ఇలా…: జిల్లాకు మంజూరు చేసిన ఎనిమిది పనుల్లో విజయనగరంలో సంతకాల వంతెన, గాజులరేగ ఆర్వోబీని  పూర్తి చేసినందుకు రైల్వే అధికారులకు అభినందనలు తెలియజేశారు. మిగిలిన గాడీఖానా, వి.టి.అగ్రహారంలలో రైల్వే వంతెనలు (ఆర్‌యూబీ) త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

            బొబ్బిలి మల్లంపేటలో ఆర్‌యూబీ పనులు టెండర్లు పూర్తయ్యాయని, పనులు ప్రారంభించాలన్నారు. బొబ్బిలి రైల్వేస్టేషను నుంచి సీతానగరానికి మళ్లించిన గూడ్స్‌ లోడింగ్‌ పనులు చేపట్టాలన్నారు. విజయనగరం రైల్వే స్టేషనులో మూడు లిఫ్ట్‌లకు ఒకటి ఎమ్పీల్యాడ్స్‌ నిధులతో సమకూర్చామని, మిగిలిన రెండింటిని ఏర్పాటు చేయాలన్నారు. స్టేషనులో రెండో ప్రవేశం వద్ద మంజూరు చేసిన ఆర్‌యూబీ పనులు ప్రారంభించాలని కోరారు.

జిల్లాకు సంబంధించి కొత్తగా చేసిన ప్రతిపాదనలు:  చీపురుపల్లి రైల్వేస్టేషను సమీపంలో కొత్తగా ఆర్‌యూబీ నిర్మాణం బీ గరీబ్‌రథ్‌, గోదావరి, తిరుమల, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను విజయనగరం వరకు పొడిగించాలి. బీ చీపురుపల్లి రైల్వేస్టేషనులో తత్కాల్‌ కేంద్రాన్ని పునరుద్ధరించాలి.బీ జిల్లాలో అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫాంల ఎత్తు పెంచాలి.బీ విజయనగరం రైల్వే స్టేషనులో ప్లాట్‌ఫాం షెల్టర్లు విస్తరించాలి.

               బీ విజయనగరం రైల్వేస్టేషను బయట హరిత మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. స్టేషనులో 4, 5 ప్లాట్‌ఫాంల వద్ద కోచ్‌ స్థితి ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. బీ బారువ రైల్వేస్టేషనులో తాగునీరు, షెల్టరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలి. బీ విజయనగరం రైల్వే స్టేషను సమీపంలో తూనిక వంతెనను ఏర్పాటు చేయాలి. మామిడి రవాణాదారులకు ఉపయోగకరంగా ఉండేందుకు దోహదపడనుంది.బీ విజయనగరంలో సంతకాల వంతెన పక్కనున్న పాత వంతెన కాలపరిమితి ముగిసినందున కొత్తగా నిర్మించాలి.