News

Realestate News

రైల్వే క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం

రైల్వే క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: తూర్పుకోస్తా రైల్వే ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు రైల్వే స్టేడియంలో బుధవారం ప్రారంభమయ్యాయి. శిబిరాలను డీఆర్‌ఎం ఎం.ఎస్‌.మాథుర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులంతా వారికి నచ్చిన ఆట ఆడాలన్నారు. శిబిరాల్లో పాల్గొన్నవారంతా ఇక్కడ నేర్చుకున్న మెలకువలను తర్వాత కూడా సాధన చేయాలన్నారు. అప్పుడే మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రైల్వే క్రీడాధికారి సక్కీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ క్రీడాకారులకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్‌, టేబుల్‌టెన్నిస్‌, షటిల్‌బ్యాడింటన్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ తదితర క్రీడల్లో శిబిరాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో రైల్వే అసిస్టెంట్‌ క్రీడాధికారి సిహెచ్‌.విష్ణుమూర్తి, అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ మేనేజరు శివ హర్ష, అనిల్‌, క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo