News

Realestate News

రైలెక్కిన పోరాటం

రైలెక్కిన పోరాటం
విశాఖ స్టేషన్‌లో పట్టాలపైకి దిగిన ఆందోళన కారులు
తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌
10 నిమిషాల పాటు నిలిచిపోయిన పలాస పాసింజర్‌
రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నంలో వైకాపా నేతల రైల్‌రోకో గందరగోళానికి దారితీసింది. వైకాపా నేతలు, కార్యకర్తలు జ్ఞానాపురం మార్గం గుండా స్టేషన్‌ పరిసరాల్లోకి ప్రవేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన చట్టంలో హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూకుమ్మడిగా స్టేషన్‌లోకి చొరబడిన ఆందోళనకారులు 8వ నెంబరు ప్లాట్‌ఫామ్‌పై బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న పలాస పాసింజర్‌ ఇంజిన్‌ ఎక్కి ఆందోళన చేశారు. తర్వాత పట్టాలపైకి దిగి ప్రత్యేక హోదా నినాదాలు కొనసాగించారు. పట్టాలు, ఇంజిన్‌ పైకి ఎక్కిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పటికే దాదాపు 10 నిమిషాలపాటు పలాస పాసింజర్‌ స్టేషన్లో నిలిచిపోవడంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు.

నిర్లక్ష్యం తగదు…: వైకాపా నేతలు మళ్లా విజయ్‌ప్రసాద్‌, గుడివాడ అమర్‌నాథ్‌, తైనాల విజయ్‌కుమార్‌, వంశీకృష్ణశ్రీనివాస్‌, గరికిన గౌరి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, ఈ విధానం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైల్‌రోకోకు మద్దతుగా ఏయూ విద్యార్థి నాయకుడు సమయం హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో యువత స్టేషన్‌కు వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో వైకాపా నేతలు జాన్‌ వెస్లీ, కోలాగురువులు, సనపల తిరుపతిరావు, వెంకటేష్‌, లక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

కేసులకు సిద్ధమైన ఆర్పీఎఫ్‌: రైల్‌రోకోకు దిగిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఆర్పీఎఫ్‌ పోలీసులు కేసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాలపై నిరసన తెలిపిన వారితో పాటు ఇంజిన్‌ ఎక్కి నినదించిన వారిని నిఘా కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ లంకా రమణకు అప్పగించినట్లు సమాచారం. రెండు రోజుల్లో సమన్లు పంపించడానికి చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo