రైలు ఇంజిన్ నుంచి పొగలు
రైలు ఇంజిన్ నుంచి పొగలు
తుటిలో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం నుంచి భగత్కోటి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ నుంచి పొగలు వెలువడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఇంజిన్ వెనుక ఉన్న బోగీల్లోకి పొగ ప్రవేశించడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు.
డ్రైవరు రైలును నిలిపివేసి ఇంజిన్ మరమ్మతు చేయడంతో పొగ ఆగిపోయింది.
దీంతో రైలు మళ్లీ గమ్యంవైపు బయలుదేరింది.
ఈకో రైల్వే ప్రధాన ప్రజాసమాచార అధికారి నిరాకర్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం
నుంచి బయలుదేరిన రైలు నువాపడా జిల్లా హరిశంక స్టేషన్ దాటిన తర్వాత రైలుకు ఉన్న రెండు
ఇంజిన్లలో ఒకదాని నుంచి పొగ వెలువడింది.
డ్రైవరు రైలును నిలిపివేశారు.
20 నిమిషాల్లో మరమ్మతులు చేసి గమ్యంవైపు తీసుకెళ్లారు.
ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
పొగ చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు నుంచి దిగిపోయారు.