రేరా… దూరందూరం..
స్థిరాస్తి నియంత్రణ చట్టం
(రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) కింద వివరాలు
ఈనాడు, విశాఖపట్నం

29 పత్రాల సమాచారం ఇవ్వాల్సిందే….
రేరా చట్టం కింద ప్రాజెక్టు నమోదు చేయాలంటే సుమారు 29 రకాల పత్రాలివ్వాలి. సుమారు 29 పేజీల సమాచారం రేరా అంతర్జాల చిరునామాలో నమోదు చేయాలి. ప్రాజెక్టు బ్రోచర్ సహా ప్రతీ అంశాన్ని వివరించి, సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి. కొనుగోలుదారులకు విక్రయ సమయంలో ఇచ్చే ప్రతి హామీ లిఖితపూర్వకంగానే ఉండాలి. ఆ చట్టం ప్రకారం వాటిని కచ్చితంగా అమలు చేయాలి.
ఉల్లంఘిస్తే… : రేరా ప్రకారం నమోదైన ప్రాజెక్టులో హామీల ఉల్లంఘన జరిగితే కొనుగోలుదారుడు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఇతను చెల్లించిన మొత్తాన్ని సంబంధిత నిర్మాణదారుడు వడ్డీ సహా 45 రోజుల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్థిక లావాదేవీల్లోనూ పారదర్శకత….: ఈ చట్టం ప్రకారం నిర్మాణరంగ సంస్థలు ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించాలి. ప్రతి ప్రాజెక్టుకు ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ఖర్చు, జమలన్నీ ఆ ఖాతా ద్వారానే జరగాలి. ఒకే సంస్థ వివిధ ప్రాజెక్టులు చేపడితే.. ఖాతాలను కూడా విడివిడిగానే నిర్వహించాలి. ప్రాజెక్టు నిమిత్తం వసూలు చేసిన మొత్తంలో 70 శాతం ఆ ప్రాజెక్టుకే వెచ్చించాలి. అంటే.. ఆ డబ్బును ఇతర ప్రాజెక్టులకు మళ్లించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదు.
ఈ ఖాతాల నిర్వహణ వల్ల పన్ను ఎగవేతకు అవకాశం ఉండదు. బీ ప్రాజెక్టు పనులను మూడు నెలలకోసారి అంతర్జాలంలో నమోదు చేయాల్సిందే. బీ స్థిరాస్తి సంస్థలు ముద్రించే బ్రోచర్లను కూడా అప్లోడ్ చేయాల్సిందే. అందులో ఏమేం వసతులను పేర్కొన్నారో ఆ ప్రాజెక్టులో అవన్నీ నిర్మించాల్సిందే.
* ఆయా ప్రాజెక్టుల తరపున మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారు, ఏజెంట్లు, సర్వేయర్లు, ఆర్కిటెక్టు సంస్థల వివరాలను కూడా రేరా కింద నమోదు చేసుకోవాల్సిందే. నిబంధనల ఉల్లంఘన జరిగితే వీరు కూడా బాధ్యులవుతారు.
* ప్రాజెక్టు పూర్తయ్యాక ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత సంబంధిత సంస్థదే.
* కొనుగోలుదారులు సొమ్ము చెల్లింపులో ఆలస్యమైతే.. ఆ మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలి.
* వెంచర్ ప్రారంభించగానే అడ్వాన్సులు తీసుకోవడం, పెద్దఎత్తున మార్కెటింగ్ చేయడం రేరా ప్రకారం నిషిద్ధం. లేఅవుట్‌కు ప్రభుత్వపరమైన అనుమతులన్నీ వచ్చి, రేరా నెంబరు జారీ అయ్యాకే మార్కెటింగ్, విక్రయాలు ప్రారంభించాలి. * రేరా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు మాత్రమే రుణాలివ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. బీ రేరా చట్టం అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీని నియమించింది.
రేరాతో పారదర్శకత…: రేరా చట్టం వల్ల స్థిరాస్తి వ్యాపారంలో పారదర్శకత సాధ్యమవుతుంది. నిపుణులతోనే పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయాలి. మార్పు చేర్పులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. ఆన్లైన్ వ్యవస్థలపై అవగాహన లేక చాలామంది వారి ప్రాజెక్టులను నమోదు చేయలేదు. ప్రాజెక్టు వివరాలను రేరా అధికారులకు అందజేశారు. వాటిని ఆన్లైన్లోనే నమోదు చేయాలని అధికారులు సూచించారు. వ్యాపారుల్లో అవగాహన కోసం నరెడ్కో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించాం.