రేపు సామూహిక అక్షరాభ్యాస,
రేపు సామూహిక అక్షరాభ్యాస,
సరస్వతీపూజ మహోత్సవం
ఈనాడు-సీఎంఆర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్షరాభ్యాసానికి విశేషమైన రోజు కావడంతో ఆదివారం
మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో ఉదయం 9 గంటల నుంచి ‘ఈనాడు’,
‘సీఎంఆర్’ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస, సరస్వతీపూజ మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది.
ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
అనంతరం పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులిస్తారు.
అక్షరాభ్యాస, సరస్వతీపూజ మహోత్సవానికి ఐదుసంవత్సరాల లోపు వయసున్న చిన్నారులకు సంప్రదాయ దుస్తులు వేయించి
విశాఖపట్నం మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌కు ఉదయం 9 గంటలకు తీసుకురావాలి.
పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం,
సరస్వతీ పూజ మహోత్సవం జరగనుంది. ఇప్పటికే అక్షరాభ్యాసం పూర్తైన పిల్లలతో సరస్వతీపూజ చేయిస్తారు.
మరిన్ని వివరాల కోసం 70326 60403 ఫోన్నెంబరును సంప్రదించాలి.