News

Realestate News

రేపు శమీపూజ మహోత్సవం

vizag real estate news

రేపు శమీపూజ మహోత్సవం
ముత్యాల పల్లకీలో వూరేగనున్న అప్పన్న స్వామి
సాయంత్రం 6గంటలకు దర్శనాలు నిలివేత
సింహాచలం, న్యూస్‌టుడే: పిలిచిన పలికే దైవం, భక్తకోటి పరంధాముడు అప్పన్న స్వామి పట్టు పీతాంబరాలు, సర్వాభరణ అలంకరుడై కొండ దిగువన ఉద్యానవనంలో జరిగే జమ్మి వేట ఉత్సవానికి సింహగిరి నుంచి దిగి వస్తే ఆ దివ్య తేజస్సును తిలకించేందుకు తరలి వచ్చే భక్తకోటికి పట్టరాని ఆనందం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కొండ దిగువన ఉద్యానవనంలో శమీ పూజ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇందు కోసం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు నిలుపు చేస్తారు. ఉత్సవం సందర్భంగా స్వామిని మధ్యాహ్నం 3.30 గంటలకు సర్వాభరణలతో శ్రీరాముడిగా అలంకరణ చేస్తారు. అనంతరం వేద¿ మంత్రాలు, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామిని పల్లకీలో కొండ దిగువన ఉద్యానవనంలోకి తీసుకొచ్చి శమీ ఉత్సవం నిర్వహిస్తారు.

నూతనంగా ముత్యాల పల్లకీ తయారీ
ఈ సారి జమ్మివేట ఉత్సవంలో స్వామిని వూరేగింపుగా తీసుకెళ్లేందుకు అధికారులు రూ.లక్ష ఖర్చు చేసి ప్రత్యేకంగా ముత్యాల పల్లకీ తయారు చేయిస్తున్నారు. 3కిలోల మంచి ముత్యాలతో చూడముచ్చటగా పల్లకిని తీర్చిదిద్దుతున్నారు. ఈ పల్లకీలో స్వామిని వూరేగిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఇంజినీరింగ్‌ అధికారులు పూలతోటలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo