రేపు ఉద్యోగమేళా
రేపు ఉద్యోగమేళా
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఉపాధి కల్పన మిషన్లో భాగంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల
12(బుధవారం) ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు.
సినర్జీస్ కాస్టింగ్ ప్రైవేటు లిమిటెడ్లో ఆపరేటర్ ట్రైనీస్ పోస్టులకు ఐ.టి.ఐ (ఫిట్టర్, మిషనిస్టు, డీజిల్ మెకానిక్, ఎం.ఎం.టి.ఎం.)
ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆపరేటర్స్ ఉద్యోగాలకు డిప్లమో ఇన్ మెకానికల్ పూర్తి చేసి ఉండాలన్నారు.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి పెందుర్తి టి.టి.డి.సి. ప్రాంగణంలో జరిగే ఉద్యోగ మేళాకు హాజరుకావాలని,
ఇతర వివరాలకు 88867 12299 ఫోన్నెంబరులో సంప్రదించాలని కోరారు.