News

Realestate News

రూ.85 కోట్లతో రహదారుల అభివృద్ధి

Transport vehicles to be diverted to Anandapuram Sabbavaram Anakapalle Highway roads in vizag to control accidents news image

రూ.85 కోట్లతో రహదారుల అభివృద్ధి
సీలేరు, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతీయులు ఎదురు చూస్తున్న ఘాటüరోడ్డు విస్తరణకు పాలనపరమైన అనుమతులు వచ్చాయని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసి కేంద్ర కార్యాలయానికి పంపించామని రహదారులు, భవనాల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.బాబూరావు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రూ. 85 కోట్లతో 76 కిలోమీటర్ల మేర రహదారిని రెండు లైన్లుగా విస్తరించడానికి కార్యాచరణ రూపొందించామని… 2016-17 ఆర్థిక సంవత్సరంలో గిరిజన ఉప ప్రణాళిక ద్వారా నిధులను ఇందుకోసం వెచ్చించనున్నారని తెలిపారు. ఆరు బ్లాకులుగా పనులు విభజించినట్లు చెప్పారు. ఆర్వీ నగర్‌ నుంచి ఎగువ లంకపాకలు వరకూ రూ. 12 కోట్లు, ఎగువలంకపాకలు నుంచి ధారాలమ్మ గుడి ముందు ఉన్న ప్రమాదకర మలుపు వద్ద వరకూ రూ. 12 కోట్లు… అక్కడ నుంచి ధారాలమ్మగుడి వరకూ రూ. 9 కోట్లు… గుడి నుంచి ధారకొండ పీహెచ్‌సీ, రుష్యాగుడా మీదుగా వై జంక్షన్‌ వరకూ రూ. 15 కోట్లు… వై జంక్షన్‌ నుంచి సీలేరు ప్రాజెక్టు వరకూ రూ. 12 కోట్లు… అక్కడ నుంచి పాలగెడ్డ వరకూ రూ. 24 కోట్లతో రహదారిని అభివృద్ధి చేయడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. చింతపల్లిలో రూ. 1.5 కోట్లతో నిర్మించదలిచిన అతిథిగృహానికి సంబందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని… త్వరలో వీటిని తయారుచేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఈఈ తెలిపారు. చింతపల్లి నుంచి ఆర్వీనగర్‌ వరకూ రూ. 20 కోట్లుతో జరుగుతున్న రహదారి విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈఈ తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఈ జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.