News

Realestate News

రూ. 7 లక్షలతో మంచినీటి కేంద్రాలు

రూ. 7 లక్షలతో మంచినీటి కేంద్రాలు
ఆరిలోవ: జూ పార్కు గేటు వద్ద దివిస్‌ ల్యాబ్‌రేటరీ ఆధ్వర్యంలో రూ.7 లక్షల వ్యయంతో రక్షిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి గేటువద్ద ఒకటి, సాగర్‌నగర్‌ వైపు వెనుక గేటువద్ద ఒకటి ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో ఇటు జూ సందర్శకులకే కాక ప్రయాణికులకు కూడా ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. జూ లోపల ఇలాంటి కేంద్రాలు నాలుగు గతంలోనే ఏర్పాటు చేయగా వాటికి అదనంగా వీటిని ఏర్పాటుచేశారు.