News

Realestate News

రూ.400 కోట్లతో ఉపాధి పనులు

రూ.400 కోట్లతో ఉపాధి పనులు
తామరం (మాకవరపాలెం), న్యూస్‌టుడే:  ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి  రూ.400 కోట్లు మంజూరయ్యాయని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. సోమవారం మండల ఉపాధిహామీ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది 195 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటికి వంద లక్షల పనిదినాలు పూర్తి చేశామన్నారు. డీఆర్‌డీఏ ద్వారా మూడువేల ఎకరాల్లో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం, ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ, 15 వేల ఎకరాల్లో సిల్వరు మొక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 800 కిలోమీటర్ల సిమెంట్‌ రహదారులు, 500 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికు రహదారుల పనులు జరుగుతున్నాయని, వంద అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. భూగర్భ  డ్రైనేజీ నిర్మాణాలకు నియోజకవర్గానికి కోటిరూపాయలు మంజూరైందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 పాఠశాలలకు ప్రహరీను నిర్మిస్తామని, ముందుగా 16 బాలికల పాఠశాలలను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో వంద కిలో మీటర్ల మేరకు రోడ్ల పనులు చేపడతామని తెలిపారు. జలసిరి పథకంలో రెండువేల బోర్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 800 బోర్లు వేయించామని వివరించారు. ఉపాధి కూలీలకు ఎప్పటికప్పుడు వేతనం వ్యక్తిగత ఖాతాల్లో వేస్తున్నామని, ఆన్‌లైన్‌ కారణంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికీ వారికి కూడా డబ్బులు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసు, ఏపీఓ డి.వి.యరకయ్య తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo