రూ.4 కోట్లతో ఆసుపత్రి భవనం
పాడేరులో నేడు ప్రారంభించనున్న వైద్యారోగ్య మంత్రి

నేడు మంత్రి పర్యటన
పాడేరు, అరకులోయ: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మంగళవారం పాడేరు, అరుకు మండలాల్లో పర్యటించనున్నట్లు ఏడీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అరకులోయలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు అరకులోయ వచ్చిన ఆయన ఈ భవన సముదాయాన్ని ప్రారంభించి ఇక్కడి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం విశాఖకు బయలుదేరి వెళ్తారు.
Source : http://www.eenadu.net/