News

Realestate News

రూ.240 కోట్లతో అభివృద్ధి పనులు

డీపీఆర్‌ తయారీకి రంగం సిద్ధం
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విశాఖ నగరానికి పర్యాటకులను ఆకర్షిస్తున్న సముద్రతీర ప్రాంతం, పాతనగరంలోని పురాతన కట్టడాలను రూ.240 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఆయా నిధులు సమకూర్చడానికి ప్రపంచ బ్యాంకు ముందు కొచ్చింది. ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో భాగంగా సముద్రతీర ప్రాంత అభివృద్ధి, పాతనగరంలోని కట్టడాల అభివృద్ధి ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ (సవివర పథక నివేదిక) తయారు చేయడానికి కన్సల్టెన్సీలను జీవీఎంసీ ఆహ్వానించింది. 19 మంది పోటీపడగా, వారిలో ఆరుగురికి అర్హతలున్నట్లు జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. వారిలో ఒకరిని టెండరు ద్వారా తీసుకోనున్నారు. నగరంలోని సముద్రతీర ప్రాంత అభివృద్ధి, ఇతర పనులు చేపట్టడానికి ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీరు చంద్రయ్య తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo