News

Realestate News

రూ. 2.40 కోట్లతో గాజువాకలో రింగురోడ్డుమంత్రి గంటా శంకుస్థాపన

రూ. 2.40 కోట్లతో గాజువాకలో రింగురోడ్డుమంత్రి గంటా శంకుస్థాపన
గాజువాక, న్యూస్‌టుడే: గాజువాకలో రూ. 2.40 కోట్లతో నిర్మించనున్న రింగు రోడ్డు పనులను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. వుడారోడ్డు కూడలిలో వుడా వీసీ బాబూరావునాయుడుతో కలిసి భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సకాలంలో పనులు పూర్తి చేసి, రింగురోడ్డును అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాకలో ట్రాఫిక్‌ రద్దీ నివారణకు, ప్రత్యామ్నాయ రహదారిగా రింగురోడ్డు ఉపయోగపడుతుందన్నారు. 296 జీవో కింద నిరుపేదలకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని తెదేపా నాయకులు పల్లా శ్రీనివాస్‌, ప్రసాదుల శ్రీనివాస్‌, ఎండీ రఫీ, పులి వెంకటరమణారెడ్డి, కరణం కనకారావు మంత్రిని కోరారు.