News

Realestate News

రూ. 2.35 కోట్లతో ఆలయాల అభివృద్ధి

రూ. 2.35 కోట్లతో ఆలయాల అభివృద్ధి
సహాయ కమిషనర్‌ పుష్పవర్ధన్‌
పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో రూ.2.35 కోట్లతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ వి.వి పుష్పవర్ధన్‌ తెలిపారు. సోమవారం పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిధులతో విశాఖ నగరంలో కోదండరామస్వామి. పాయకరావుపేట పాండురంగస్వామి, మాడుగుల రామాలయం తదితర ఆలయాలకు పూర్తిస్ధాయిలో పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. దీంతోపాటు మరో రూ.నాలుగు కోట్లతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు రక్షణ గోడలు, భక్తులకు ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. ఈ ఏడాది ఆలయం భూములు వేలం ద్వారా రూ.1.40 కోట్లు, దుకాణాల ద్వారా రూ.53 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆలయ సిబ్బంది వేతనాలు పెంచుతున్నామన్నారు. చీమలపాడు, కల్యాణపులోవ, పినగాడి, తదితర చోట్ల పురాతన కోనేరులు భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక నిర్మాణ పనులుచేసి అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

Source : http://www.eenadu.net/

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo