రూ.2 కోట్ల విలువైన యంత్రాలను అందించిన శామ్సంగ్

- రూ.2 కోట్ల విలువైన యంత్రాలను అందించిన శామ్సంగ్
విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జ్ ఆస్పత్రికి శామ్సంగ్ సంస్థ రూ.2 కోట్ల విలువైన డిజిటల్ రేడియోగ్రఫీ, ఆల్ర్టాసౌండ్ కలర్ డాప్లర్ మెషీన్లను అందించింది. కేజీహెచ్‌లోని రేడియాలజీ విభాగంలో ఏర్పాటుచేసిన ఈ పరికరాలను సోమవారం జాయింట్ కలెక్టర్ సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పరికరాలతో నిరుపేదలకు మెరుగైన సేవలను అందించేందుకు అవకాశముందన్నారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి పరికరాలను అందించడం గొప్ప విషయన్నారు.