News

Realestate News

రూ.2 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి

రూ.2 కోట్లతో క్రీడా మైదానం అభివృద్ధి
ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే : ఇచ్ఛాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం (రాజావారి గ్రౌండ్‌) అభివృద్ధికి రూ.2 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, నిరభ్యంతర పత్రం జారీ చేయకపోవడం వల్లనే పనులు ఆలస్యమయ్యాయని ప్రాంతీయ క్రీడాభివృద్ధి అధికారి (అమరావతి) పి.దేవానంద్‌ అన్నారు. గురువారం ఇచ్ఛాపురం వచ్చిన ఆయన ఇక్కడ మైదానాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావుతో కలిసి పరిశీలన చేశారు. మైదానం దివ్యంగా ఉందని, మినీ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు అనుకూలమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా సత్వరగా పత్రాన్ని అందిస్తే, టెండరు ద్వారా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం మండల తహసీల్దారు కార్యాలయంలో ఉన్న మైదానం దస్త్రాలను పరిశీలించారు. హద్దులు, కొలతలు తీసుకున్నారు. కళాశాల ప్రధాన ఆచార్యులు సంహాద్రి ప్రధానో, ఉప తహసీల్దారు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.