రు-అర్బన్ మిషన్‌లో అరకు అభివృద్ధి

జడ్పీ సీఈఓ జయప్రకాష్
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్టంలో తొలిదశలో అయిదు జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో విశాఖ నుంచి అరకులోయ మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మూడేళ్ల ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది రూ.30 కోట్లు నిధులతో తాగునీరు, రహదారులు, 20 అంశాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించవచ్చన్నారు. బుధవారం సాయంత్రం నాటికి పంచాయతీ, మండల స్థాయి తీర్మానాలు చేసి పూర్తిస్థాయి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తొలిదశలో భాగంగా 20కిలో మీటర్లు పరిధిలో ఉన్న 11 పంచాయతీల్లో అభివృద్ధి పనులను గుర్తించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దత్తత పంచాయతీ పెదలబుడుకు అదనంగా 70పనులు మంజూరయ్యాయని తెలిపారు. మండలంలోని పలు పంచాయతీల్లో అవతవకలపై వచ్చిన ఫిర్యాదులు మేరకు విచారణ చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరావు తెలిపారు. బస్కి పంచాయతీపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా, గత రెండు గ్రీవెన్సుల్లో వచ్చిన ఫిర్యాదు మేరకు మాడగడ, కొత్తభల్లుగుడ పంచాయతీ కార్యదర్శిపై విచారణ చేపడతామన్నారు. డుంబ్రిగుడ మండలంలో మూడు పంచాయతీలకు ఈఓపీఆర్డీ, సర్పంచి జాయింట్ చెక్ అధికారాన్ని ఇవ్వగా మిగిలిన పంచాయతీలకు పూర్తిస్థాయి చెక్ పవర్‌ను ఇచ్చినట్లు చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధికి కేటాయించిన పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణకుమారి, ఎంపీడీఓ మల్లిఖార్జునరావు, పెదలబుడు సర్పంచి సమర్థి గులాబి, వైకాపా నాయకులు అప్పాలు, రఘునాథ్, ఇతర శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/