News

Realestate News

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జట్టు ఎంపిక

vizag real estate news

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జట్టు ఎంపిక
సీలేరు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి విద్యుత్తు ఇంటర్‌ సర్కిల్‌ పోటీలకు సీలేరు జట్టు ఎంపిక ప్రక్రియ ఆదివారం సాయంత్రం స్థానిక ఫుట్‌బాల్‌ క్రీడా మైదానంలో జరిగింది. ఏపీపీ జెన్‌కో ఎస్‌ఈ మురళీమోహన్‌, ఈఈ రమేష్‌ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి దిగువ సీలేరు స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనే సీలేరు జట్టును ఎంపిక చేశారు. గత ఏడాది రాష్ట్ర స్థాయి విద్యుత్తు కబడ్డీ పోటీల్లో సీలేరు జట్టే ప్రథమ స్థానం సాధించడంతో జట్టు ఎంపికలో అధికారులు ఆచితూచి వ్యవహరించారు. ఈసారి టగ్‌ ఆఫ్‌ వార్‌ నిర్వహిస్తుండటంతో ఈ జట్టునూ ఎంపిక చేశారు. సుమారు 20 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొనగా 12 మంది ఎంపికయ్యారు. డి.నాగేశ్వరరావు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. జట్టు సభ్యులుగా ఆనందరావు, నాగేశ్వరరావు, కిమ్సాలామా, భీమరాజు, ఓబీ, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శంకర్‌, అప్పారావు, శివ, రాంబాబు ఎంపికయ్యారు. జట్టు సభ్యులకు యు.ఎస్‌.హెచ్‌.ఇ.ఎస్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులను అందజేశారు. స్పోర్ట్స్‌ కార్యదర్శి పాపారావు తదితరులు పాల్గొన్నారు.