News

Realestate News

రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ

vizag real estavizag real estate newste news

రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ
అతి త్వరలో చట్టం తేబోతున్నాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
స్వచ్ఛభారత్‌లో ఏపీ ముందుందని ప్రకటన
ఈనాడు, దిల్లీ: స్వచ్ఛభారత్‌ అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మరే రాష్ట్రంలో లేని విధంగా చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే పది ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో జరిగిన స్వచ్ఛభారత్‌ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘2019కల్లా దేశం పూర్తి స్వచ్ఛంగా తయారవుతుంది. చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలోని మున్సిపాల్టీలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాం. దేశంలో ఇప్పటివరకు గుజరాత్‌, ఏపీలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. త్వరలో గ్రామాలను కూడా ఇదే మాదిరి తయారుచేస్తాం. అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీకంపోస్ట్‌ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏర్పాటుచేస్తాం’’ అని వివరించారు. 3వ తేదీ నుంచి అమరావతి నుంచే పూర్తిస్థాయి పాలన ప్రారంభంకాబోతున్న విషయం గురించి విలేకర్లు అడిగినప్పుడు… అది సంతోషం కల్గిస్తోందన్నారు. భవిష్యత్తులో దాన్ని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తయారుచేస్తామన్నారు. ఏపీలో అతి త్వరలో రియల్‌ఎస్టేట్‌ నియంత్రణ సంస్థను ఏర్పాటుచేస్తూ చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు నిర్వహించిన సైన్యాన్ని ఆయన అభినందించారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు.

స్వల్ప కలకలం
చంద్రబాబు స్వచ్ఛభారత్‌ సమావేశం ముగించుకొని విజ్ఞాన్‌భవన్‌ నుంచి బయటికొస్తూ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడి ఏసీ సిలిండర్‌ పెద్దశబ్దంతో పేలింది. అందులోంచి గ్యాస్‌ వెలువడటంతో ఆ ప్రాంతంలో స్వల్ప అలజడి నెలకొంది. చంద్రబాబుని ఎన్‌ఎస్‌జీ సిబ్బంది కొంత దూరం తీసుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడ తనకు ఎదురైన వారితో మాట్లాడి వెళ్లిపోయారు. ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే తనకు తారసపడిన జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ ఓరాతో మాట్లాడారు. సరిహద్దుల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo