రాష్ట్రంలో మరో 10 రైతుబజార్ల ఏర్పాటు

రాష్ట్రంలో మరో 10 రైతుబజార్ల ఏర్పాటు
మార్కెటిం’ శాఖ కమిషనం పి.మల్లికార్జునరావు
గురుద్వారా, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెటిం’ శాఖ కమిషనంü, రైతుబజార్ల సీఈవో పి.మల్లికార్జునరావు అన్నారు. సీతమ్మధార రైతుబజాం లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతుసేవ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులకు చేయూతనివ్వడానికి, ప్రజలకు తాజా కూరగాయలను అందించాలనే లక్ష్యంతోనే బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా మండపేట, పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, కృష్టా జిల్లాలో నాలుగు, గుంటూరులో బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెల చివరిలోగా వీటిని ప్రారంభిస్తామన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్‌యార్డులో రూ.4 లక్షలతో షెడ్డు నిర్మించి హోల్‌సేల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతుసేవ కేంద్రం ద్వారా రైతులకు పంటలు పండించే విధానం, ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట సహాక నిర్వాకులు కాళేశ్వరరావు, డీడీ సుధాకం, జేడీ శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి ఎస్టీ.నాయుడు, ఎస్టేట్ అధికారి వైవీ మురళీకృష్ణ, వినియోగదారుల సంఘం సభ్యుడు రామారావు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/