News

Realestate News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.55 లక్షల గృహాల మంజూరు

Vizag Real Estate news

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.55 లక్షల గృహాల మంజూరు
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని
సింహాచలం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల కోసం ప్రభుత్వం 2.55.లక్షల గృహాలు మంజూరు చేసిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఆదివారం ఆమె అప్పన్న స్వామిని దర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి నియోజక వర్గానికి 1500 గృహాలు మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తోందన్నారు. 2014లో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఇళ్ల మరమ్మతుల కోసం ఇంటికి రూ.25 వేలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1200 కోట్లు పింఛన్ల కోసం కేటాయిస్తే తమ ప్రభుత్వం ఏడాదికి రూ. 5వేల కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు రూ. 25 వేల కోట్లు కేటాయించిందన్నారు. 82 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ మాట తప్పకుండా రెండు విడతలుగా ఒక్కొక్క మహిళకు రూ.10 వేలు మంజూరు చేసిందన్నారు. తొలుత మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo