News

Realestate News

రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
విశాఖపట్నం, న్యూస్‌టుడే: మన్యంలోని మారుమూల గ్రామాల్లో రహదారుల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని లెఫ్ట్‌వింగ్‌ ఎక్స్‌ట్రిమిస్ట్‌ (ఎల్‌డబ్ల్యుఈ) ప్రోగ్రామ్‌ సలహాదారు, విశ్రాంత డీజీపీ కోడె దుర్గాప్రసాద్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబరులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలపై రెవెన్యూ, పోలీసు, అటవీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హాజరైన దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద చేపట్టిన రోడ్ల పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. రోడ్ల నిర్మాణంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు.  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వేణుగోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో 54 పనులు ఉన్నాయని, వీటిలో 25 ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 14 పనులకు టెండర్లు పిలిచామన్నారు. మొదటిసారి టెండర్లకు గుత్తేదారులెవరూ రాకపోవడంతో రెండోసారి పిలిచామని చెప్పారు. 33 పనులకు సంబంధించి సర్వే పూర్తయిందని, అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. సమీక్షలో రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, నర్సీపట్నం ఓఎస్‌డీ ఆరీఫ్‌హఫీజ్‌, విశాఖపట్నం, పాడేరు డీఎఫ్‌వోలు అలాన్‌చాంగ్‌తెరాన్‌   తదితరులు పాల్గొన్నారు.