రహదారికి ఇరువైపులా బెర్ముల నిర్మాణం

దత్తి/రాజులరామచంద్రపురం (దత్తిరాజేరు), న్యూస్టుడే: మండలంలోని రాజుల రామచంద్రపురం, దత్తి గ్రామాల మధ్య ఇటీవల నిర్మించిన కొత్త తారు రహదారికి ఇరువైపులా అధికారులు మట్టి బెర్ములను వేశారు. గత నెల 27న ‘మట్టి కట్ట.. వట్టి మాట’ శీర్షికతో ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. బెర్ములు కొట్టుకుపోయిన చోట మట్టి తెచ్చి వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వేయాల్సి ఉంది. అధికారులు రహదారి మొత్తం పర్యటించి మట్టి బెర్ములు కొట్టుకుపోయిన అన్ని చోట్లా మట్టి వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.