News

Realestate News

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం
కనుల పండువగా సాగిన బ్రహ్మోత్సవాలు
మందస, న్యూస్‌టుడే : మందసలో శ్రీవాసుదేవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా సాగాయి. శ్రీ త్రిదండి అహోబిల జీయరుస్వామి ఆధ్వర్యంలో రథోత్సవం చేపట్టారు. పుర వీధుల్లో యాత్రలా సాగింది. రథంలో ఉన్న శ్రీదేవి, భూదేవి, వాసుదేవుడి విగ్రహాలను కనులారా భక్తులు చూసి తరించారు. అనంతరం ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న పుణ్యపుష్కరిణిలో చక్రతీర్థం కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, అన్నమయ్య కీర్తనలు, తీర్థగోష్ఠి, ద్వాదశారాధన, శ్రీప్పుయాగం కార్యక్రమాలు కమనీయంగా నిర్వహించారు. ఈ  ఉత్సవాల్లో భాగంగా  కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ మహత్తర కార్యక్రమాల్లో భారీ సంఖ్యల్లో భక్తులు పాల్గొన్నారు. వారం నుంచి నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి.