News

Realestate News

యోగి సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ..

యోగి సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ..

                                                                                                           

 ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ప్రమేయమున్న వ్యక్తుల పేర్లు, వివరాలతో కూడిన హోర్డింగ్‌లను జిల్లా అధికారులు లక్నోలోని కూడళ్లలో ఏర్పాటు చేయడంపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించింది.

అడ్వకేట్ శశాంక్ త్రిపాఠి వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై జస్టిస్ గోవింద్ మాతుర్, జస్టిస్ రమేష్ సిన్హాలతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ జరిపి తాజా ఆదేశాలిచ్చింది.

వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా జిల్లా యంత్రాంగం చర్య ఉందని కోర్టు అభిప్రాయపడింది.

వెంటనే హోర్డింగులు తొలగించి ఆ విషయం కోర్టుకు తెలియచేయాలని ఆదేశించింది. ఇటీవల సీఏఏ నిరసనల్లో హింసాకాండ చెలరేగడంతో అల్లర్లకు పాల్పడిన వారి నుంచి జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని ప్రకటించిన యోగి సర్కార్ ఈ దిశగా చర్యలు చేపట్టింది.

ఆ క్రమంలోనే సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో హింసాకాండ పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న పలువురు వ్యక్తుల ఫోటోలు, పేర్లు, చిరునామాలతో కూడిన హోర్డింగ్‌లను లక్నో జిల్లా యంత్రాగం నగరంలోని కూడళ్లలో ఏర్పాటు చేయడం సంచలనమైంది. హోర్డింగ్‌ల వల్ల సంబంధితులపై మూకదాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo