News

Realestate News

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతీ ఒక్కరు యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు టీవీవీగాంధీ సూచించారు. శుక్రవారం పార్వతీపురంలోని పలు యోగా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉరుకులు, పరుగులు పెట్టే నేటి రోజుల్లో యోగా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్పారు. యోగా, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స అంశాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు పతంజలి సమితి కృషి చేస్తోందన్నారు. రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో వేద విజ్ఞానం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. యోగా, ప్రాణాయామం, ఆయుర్వేదం ప్రతీ గ్రామానికి అందించి స్వచ్ఛ భారతదేశం నిర్మించాలని కృషిచేస్తున్నామని వివరించారు. ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. యోగా అభ్యాసకులకు ఆరోగ్య పరిరక్షణ అంశాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అధ్యక్షులు టి.రామలింగరాజు, యోగా శిక్షకులు ఎ.సింహాచలం, జిల్లా యువ అధ్యక్షులు ఏవీరమణ, యోగా సాధకులు పాల్గొన్నారు.